‘లేఖ వాస్తవమా? కాదా? ఆయనే స్పష్టం చేయాలి’

అమరావతి: ప్రభుత్వంతో సంప్రదించకుండా ఎన్నికలను అర్థాంతరంగా వాయిదా వేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టిందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ పేరు మీద సర్క్యులేట్‌ అవుతున్న లేఖపై తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయంలో ఎమ్మెల్యేలు అంబటి రాంబాబుతో పాటు కె.పార్థసారథి, జోగి రమేశ్‌ ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రెస్‌మీట్ పెట్టి ఏవేవో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఉన్మాద భాష మాట్లాడుతున్నారని అంబటి నిప్పులు చెరిగారు. (రాజకీయ కోణం బట్టబయలైంది: అంబటి)